విజిల్ సెన్సార్ రిపోర్ట్.. ఫ్యాన్స్‌కు ట్రీట్ ఖాయం

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం బిజిల్‌ను తెలుగులో విజిల్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు తమిళంతో పాటు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ వచ్చింది. అదిరింది సినిమా తరువాత విజయ్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా విజిల్ వేయిస్తుందని విజయ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

కాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. సినిమా బాగుందని.. మహిళలకు మంచి గుర్తింపు తీసుకొచ్చే సినిమాగా విజిల్ నిలుస్తుందని సెన్సార్ సభ్యులు తెలిపారు. కాగా దీపావళికి విజయ్ అభిమానులు ఖచ్చితంగా ఎంజాయ్ చేసే సినిమాగా విజిల్ నిలుస్తుందని.. ఈ సినిమా చూసి వారు నిజంగానే విజిల్ వేయడం ఖాయమని సెన్సార్ సభ్యులు పొగడ్తలతో ముంచెత్తారంటూ చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేశారు.

అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయ్ మూడు పాత్రల్లో నటిస్తోండగా.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారనేది చూడాలి అంటున్నారు సినీ క్రిటిక్స్.

Leave a comment