మెగా హీరో దెబ్బకు టాలీవుడ్ వదిలేసిన డైరెక్టర్

స్టార్ రైటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న వక్కంతం వంశీ ఆ తరువాత దర్శకుడిగా మారాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా మొదటి షో నుండే డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో వక్కంతంకు మరో అవకాశం రాలేదు. అప్పటికే తారక్ కోసం చాలా కాలం వేసిన వక్కంతంను ఒక్కసారిగా హీరోలంతా దూరం పెట్టారు. దీంతో వక్కంతం గురించి దాదాపు అందరూ మర్చిపోయారు.

అయితే ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వక్కంతం రెడీ అవుతున్నాడు. అయితే నా పేరు సూర్య దెబ్బకు మనోడు టాలీవుడ్‌ను వదిలి పారిపోయాడని తెలుస్తోంది. ఇప్పుడు ఓ కన్నడ హీరోను పట్టుకుని తన లక్కును పరీక్షుంచుకునేందుకు రెడీ అయ్యాడు. కన్నడ హీరో దర్శన్‌తో వక్కంతం స్టోరీ డిస్కషన్స్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతోనైనా తన సత్తా చాటాలని వక్కంతం చూస్తున్నాడు.

మరి వక్కంతం ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది సినిమా రిలీజ్ అయితేనే తెలుస్తోంది. ఏదేమైనా ఒక్క తెలుగు సినిమా డిజాస్టర్‌ కారణంగా టాలీవుడ్‌ను వదిలేయడంతో వక్కంతంపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

Leave a comment