తారక్, చరణ్‌లను రెచ్చగొట్టిన హీరో!

ప్రస్తుతం యావత్ టాలీవుడ్ ఎదురుచూస్తోన్న సినిమా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాయే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు ఆడియెన్స్. ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి న్యూస్ వచ్చినా ఆసక్తిగా చూస్తున్నారు జనం.

ఇక ఈ సినిమాలో తారక్, చరణ్‌లు చేసే పాత్రలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని తెలిపారు చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో తారక్, చరణ్‌లు తమ పాత్రలు చేసేందుకు మరో హీరో స్పూర్తినిచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన చేసే పాత్ర కారణంగానే తారక్, చరణ్‌లు స్వాతంత్ర్యం కోసం పోరాడతారని తెలుస్తోంది. అయితే ఆయన చేసే పాత్ర ఏమిటనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.

ఏదేమైనా తారక్, చరణ్‌లు చేసే కొమరం భీం, అల్లూరి పాత్రలకే స్పూర్తినిచ్చే పాత్ర అజయ్ దేవ్గన్ చేస్తున్నాడంటే ఆ పాత్ర సినిమాకు ఎంత ప్లస్ పాయింటో అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమా కోసం యావత్ తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా ఆడియెన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

Leave a comment