గన్ టు గొడ్డలి.. ట్విస్ట్ అక్కడే ఉందట!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో మహేష్ మరోసారి బాక్సాఫీస్ భరతం పట్టేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో మహేష్ ఓ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. అయితే ఇటీవల దసరా కానుకగా ఊర మాస్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో మహేష్ గొడ్డలి పట్టుకుని నిల్చున్న స్టిల్ ఆడియెన్స్‌కు విపరీతంగా నచ్చేసింది.

అయితే ఫస్ట్ టీజర్‌లో గన్ పట్టుకుని ఉన్న మహేష్ గొడ్డలి ఎందుకు పట్టుకున్నాడనే విషయం సర్వత్రా ఆసక్తిగా మారింది. ఆర్మీ ఆఫీసర్ నుండి పక్కా మాస్ పాత్రలోకి ఎందుకు షిఫ్ట్ అయ్యాడనే అంశం మహేష్ ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజన్‌లో పడేసింది. అయితే ఇదే సినిమాలో అసలు ట్విస్ట్ అని తెలుస్తోంది. మహేష్ గన్ నుంచి గొడ్డలికి ఎందుకు మారాడనేది సినిమాలో పెద్ద టర్నింగ్ పాయింట్ అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

అనిల్ రావిపూడి రాసుకున్న కథ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని ఈ పోస్టర్ చూస్తే ఇట్టే అర్ధమవుతోంది. మరి మహేష్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే ఆ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏమిటనేది సినిమా రిలీజ్ అయితేగాని చెప్పలేం. ఏదేమైనా ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Leave a comment