పవన్‌‌ ఫ్యాన్స్‌కు పూనకం తెప్పించనున్న త్రివిక్రమ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చివరి చిత్రం అజ్ఞాతవాసి ఎంతటి ఘోర పరాజయాన్ని చవిచూసిందో తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఆడియెన్స్‌ను మెప్పించడంలో సినిమా పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఆ తరువాత పవన్ రాజకీయాల్లోకి వెళ్లడం.. సినిమాలకు సెలవు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ సినిమాల్లో కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఖాళీగా ఉన్న పవన్ మనసు మళ్లీ సినిమాలవైపు మళ్లినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ మరోసారి మేకప్ వేసుకునేందుకు రెడీ అయ్యాడు. అయితే పవన్ కమ్ బ్యాక్ మూవీ ఎవరితో చేస్తే బాగుంటుందని పవన్ ఫ్యాన్స్ ఆలోచిస్తుండగా.. పవన్‌కు సూట్ అయ్యే కథను కేవలం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాత్రమే సెట్ చేయగలడని వారు భావిస్తు్నారు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం కూడా త్రివిక్రమ్ పవన్ కోసం ఓ రీమేక్ కథను రెడీ చేస్తున్నాడట.

బాలీవుడ్‌లో‌ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడట. కథలో కంటెంట్ బాగుండటంతో పవన్ కూడా ఈ సినిమాను చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ సాధించిన ఈ సినిమా తెలుగు జనాలకు ఎంతమేర ఎక్కుతుందో తెలియదు కానీ.. పవన్ కమ్ బ్యాక్ మూవీ కాబట్టి సినిమాకు ఫ్యాన్స్ పట్టం కట్టడం ఖాయమని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా అనౌన్స్‌మెంట్ రావాల్సిందే.

Leave a comment