ఇక్కడ అమలా పాల్.. అక్కడ కంగనా రనౌత్

ప్రముఖ కోలీవుడ్ నటి అమలా పాల్ ఇటీవల నటించిన ఆమె(తమిళంలో ఆడై) చిత్రం పెను సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమలా పాల్ పూర్తి నగ్నంగా నటించిందనే వార్త అప్పట్లో సినిమాపై ఎక్కడాలేని క్రేజ్‌ను తీసుకువచ్చింది. సినిమాలో కంటెంట్ సంగతేమిటో కానీ అమ్మడిని నగ్నంగా చూసేందుకు జనాలు థియేటర్లకు పరుగులు పెట్టారు.

అయితే సినిమాలో ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించడంతో వారు నిరాశకు లోనయ్యారు. దీంతో సినిమా పెద్ద సక్సెస్ కాకపోయినా యావరేజ్ సినిమాగా మిగిలింది. ఇప్పుడు ఇదే సినిమాను బాలీవుడ్‌లో తాను రీమేక్ చేస్తానంటోంది వివాదాల సుందరి కంగనా రనౌత్. ఎప్పుడూ ఏదో ఒక వార్తలో ఉండే ఈమె నగ్నంగా నటించేందుకు సిద్ధం అని అనడంతో ఇప్పుడు బాలీవుడ్ జనాలు ఆమెవైపు మరోసారి చూస్తున్నారు. గతంలో రాధికా ఆప్టే లాంటి వారు నగ్నంగా నటించినా పెద్దగా పట్టించుకోని బాలీవుడ్ జనం ఇప్పుడు కంగనా నగ్నంగా నటిస్తానంటే ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాను హిందీలో దర్శకుడు రత్నకుమార్ డైరెక్ట్ చేస్తుండగా విక్రమ్ భట్ ప్రొడ్యూస్ చేయనున్నారు. మరి కంగనా ఈ సినిమాలో ఎంతమేర నగ్నప్రదర్శన చేస్తుందనే ఆసక్తి బాలీవుడ్ జనాల్లో అప్పుడే మొదలైంది.

Leave a comment