తిప్పరా మీసం అంటోన్న హీరో!

యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న హీరో శ్రీవిష్ణు వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే తాను ఎంచుకునే కథలతో తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న ఈ హీరో సినిమా సినిమాకు చూపించే వేరియేషన్ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఈ హీరో చేసిన చలో సినిమా అతడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడం దీనికి నిదర్శన. కాగా ఇప్పుడు ఈ హీరో ఏకంగా తిప్పరా మీసం అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ తిప్పరా మీసం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకొని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో శ్రీవిష్ణు ఓ సరికొత్త అవతారంలో మనకు కనిపిస్తాడట. కాగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ప్రశ్నకు తెరదించుతూ నవంబర్ 8న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అసుర ఫేం దర్శుకుడు విజయ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

మరి ఈసారి శ్రీవిష్ణు ఎలాంటి పాత్రలో కనిపిస్తూ మనల్ని మెస్మరైజ్ చేస్తాడో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.

Leave a comment