సైరా 10 డేస్ కలెక్షన్స్.. తుక్కురేగ్గొడుతున్న చిరు

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ సైరా నరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరు పర్ఫార్మెన్స్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల దగ్గర్నుండి ప్రశంసలు వస్తున్నాయి.

అటు ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్ల పరంపరను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కొన్ని చోట్ర బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ సినిమా 10 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.94.72 కోట్లు కొల్లగొట్టింది. ఏరియాల వారీగా ఈ సినిమా 10 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – 10 డేస్ కలెక్షన్లు
నైజాం – 28.60 కోట్లు
సీడెడ్ – 17.09 కోట్లు
నెల్లూరు – 4.18 కోట్లు
కృష్ణా – 6.09 కోట్లు
గుంటూరు – 9.02 కోట్లు
వైజాగ్ – 14.42 కోట్లు
తూ.గో – 8.45 కోట్లు
ప.గో – 6.07 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 94.72 కోట్లు

Leave a comment