అవును నాది తక్కువే.. అందుకే పెంచా!

టాలీవుడ్‌లో హీరోయిన్లుకు ఛాన్సులు దొరకడమే గగనం అనుకుంటారు చాలా మంది. కానీ కొందరు తమ అదృష్టం, ప్రతిభ కారణంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకొని తమ కెరీర్‌ను కొనసాగిస్తుంటారు. వీరిలో చాలా మంది టాప్ హీరోయిన్లుగా ఎదిగి అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. వీరిలో పంజామీ గుమ్మ తాప్సీ కూడా ఒకరు. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్‌లో తన సత్తా చాటుతోంది.

ఇప్పటికే బాలీవుడ్‌లో అనేక హిట్ సినిమాలు కొట్టిన ఈ బ్యూటీ లీడ్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాకు రెమ్యునరేషన్ చాలా తక్కువ అని టాక్. దీంతో ఈమె తన నెక్ట్స్ మూవీలకు సంబంధించిన రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసింది. దీంతో నిర్మాతలు అవాక్కయ్యారు. అమ్మడు ఉన్నఫలంగా ఇలా పెంచేస్తే ఎలా అని వారు వాపోతున్నారు.

ఏదేమైనా తాస్పీ చిన్న రెమ్యునరేషాన్ని అమాంతం పెంచేయడంతో ఆమె ఫ్యాన్స్ మాత్రం సంతోషం వ్యక్తం చేశారు. ఇకపోతే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బాలీవుడ్‌లో తాప్సీ తన సత్తా చాటుతోంది.

Leave a comment