ప్రభాస్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్.. మామూలుగా ఉండదు!

బాహుబలి సినిమాతో ఒక్కాసారిగా ఆలిండియా స్టార్ హీరోగా మారిన ప్రభాస్ ఇటీవల సాహో సినిమాతో తన స్టామినా మరింత పెంచేశాడు. ఇక ఇప్పుడు విదేశాల్లో రెస్ట్ తీసుకుంటున్న ప్రభాస్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. జిల్ సినిమాతో గుర్తింపు సాధించిన రాధాకృష్ణ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అనేక వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

కాగా ఈ సినిమాకు ‘జాన్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కానీ ఆ టైటిల్ విషయంలో ఇంకా చిత్ర యూనిట్ నుండి క్లారిటీ రాలదే. అయితే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఆ అప్డేట్ ఏమిటనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌గా ఉంచారు చిత్ర యూనిట్.

ఏదేమైనా ప్రభాస్ సినిమాకు సంబంధించిన ఆ అప్డేట్ ఏమిటనే అంశం సర్వత్రా ఆసక్తిగా చూస్తున్నారు జనం. మరి ఈ అప్‌డేట్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందా అని ఆతృతగా చూస్తున్నారు ఆయన ఫ్యాన్స్. సో జస్ట్ వెయిట్ ఫర్ అక్టోబర్ 23.

Leave a comment