రాజమౌళికి 20 కోట్లు ఎసరుపెట్టిన హీరో!

సాధారణంగా స్టార్ హీరోలు సినిమాలకు కళ్లుచెదిరే రెమ్యునరేషన్‌లు తీసుకుని నిర్మాతల జేబులకు చిల్లులు పెడుతుంటారు. కాగా కొంతమంది అతిథి పాత్రలు చేస్తూ కూడా అదిరిపోయే రెమ్యునరేషన్‌లు తీసుకుని ఫ్యూజులు ఎగరగొడుతుంటారు. ఇప్పుడు ఇదే కోవలో ఓ బాలీవుడ్ హీరో కూడా తెలుగు నిర్మాతలకు చుక్కలు చూపించాడు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ RRR ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తోన్నాడు. అయితే మనోడు ఈ సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ ఎంతా అనేది తెలిస్తే మన ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. అజయ్ దేవ్గన్ ఏకంగా రూ.20 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కేవలం గెస్ట్ పాత్రకు ఇంతమొత్తంగా రెమ్యునరేషన్ తీసుకోవడం ఏమిటా అని ట్రేడ్ వర్గాలు ముక్కున వేలేసుకుంటున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మరి మనోడి పాత్ర ఎలా ఉండబోతుందా అనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Leave a comment