సైరా నరసింహారెడ్డి మూడు వారాల కలెక్షన్లు

మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ సైరా నరసింహా రెడ్డి ఇటీవల రిలీజ్ అయ్యి ఎలాంటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ తరువాత కొన్ని చోట్ల బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోగా మరికొన్ని చోట్ల యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినా ఈ సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం పడలేదు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్లు రావడంతో సినిమా తెలుగులో బ్లాక్ బస్టార్‌గా నిలిచింది. చిరంజీవి ప్రెస్టీజియస్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇక ఈ సినిమా మూడు వారాలు ముగిసేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.105.51 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఏరియాల వారీగా కలెక్ట్ చేసిన వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – మూడు వారాల కలెక్షన్లు
నైజాం – 32.49 కోట్లు
సీడెడ్ – 19.16 కోట్లు
కృష్ణా – 7.48 కోట్లు
నెల్లూరు – 4.52కోట్లు
గుంటూరు – 9.61 కోట్లు
వైజాగ్ – 16.53 కోట్లు
తూ.గో – 9.15 కోట్లు
ప.గో – 6.57 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 105.51 కోట్లు

Leave a comment