ఎన్టీఆర్‌తో సినిమాపై యంగ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు కోరుకుంటాడు. ఇప్పటికే పలువురు స్టార్ డైరెక్టర్లు ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనే తమ ఆశను వ్యక్తం చేసిన సందర్భాలు మనం చూశాం. కాగా ఇటీవల జోరుగా ప్రచారంలో ఉన్న ఓ వార్తను ఓ యంగ్ డైరెక్టర్ దాదాపు కన్ఫమ్ చేశాడు.

తమిళంలో రాజా రాణి సినిమాతో ఒక్కసారిగా దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు అట్లీ, ఆ తరువాత స్టార్ హీరో విజయ్‌తో కలిసి తేరీ, మర్సల్ వంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి విజయ్‌తోనే కలిసి విజిల్ అంటూ దీపావళి సందడి చేయనున్నాడు ఈ యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్. అయితే ఎప్పటినుంచో తారక్‌తో అట్లీ ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడంటూ తెలుగునాట ఓ ప్రచారం జోరుగా వినిపించింది.

కాగా ఇటీవల జరిగిన విజిల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు అట్లీ ఈ విషయంపై ఓ క్లూ ఇచ్చేశాడు. త్వరలోనే తారక్‌తో తన నెక్ట్స్ మూవీ ఉండబోవచ్చంటూ చెప్పుకొచ్చాడు. దీంతో తారక్ ఫ్యాన్స్‌ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. విజయ్ లాంటి స్టార్ హీరోకు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అందించిన ఈ హీరో తమ అభిమాన హీరోకు ఎలాంటి కథను రెడీ చేస్తాడో అని తారక్ ఫ్యాన్స్ ఆతృతగా చూస్తున్నారు. కాగా విజిల్ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 25న రిలీజ్ కానుంది.

Leave a comment