అంతకు మించి చూపిస్తానంటోన్న మహేష్ బ్యూటీ

బాలీవుడ్ నుండి వచ్చి టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించిన అందాల భామ కియారా అద్వానీ ప్రస్తుతం మళ్లీ బాలీవుడ్‌లోనే కొనసాగుతోంది. వరుసబెట్టి సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ అమ్మడు కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లో చేస్తోన్న ఓ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

గతంలో లస్ట్ స్టోరీస్ లాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్‌లో నటించిన కియారా ఇప్పుడు అంతకు మించిన హాట్ కంటెంట్‌లో నటించేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ నిర్మాత నిఖిల్ అద్వానీ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘ఇందూ కి జవానీ’ అనే హాట్ టైటిల్‌ను కన్ఫం చేశారు చిత్ర యూనిట్. తాజాగా షూటింగ్ కూడా మొదలు పెట్టిన ఈ సినిమాలో కియారా అదిరిపోయే హాట్ సన్నివేశాల్లో నటిస్తోంది.

ఇక ఈ సినిమా గనక రిలీజ్ అయితే ఆమె అందాలను చూసేందుకు కియారా ఫ్యాన్స్ థియేటర్లకు పరుగులు పెట్టడం ఖాయమని తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ మూవీ బాలీవుడ్ జనాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a comment