సైరా 20 రోజుల కలెక్షన్లు.. హ్యాట్సాఫ్ చిరు!

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ మూవీ సైరా నరసింహా రెడ్డి సినిమా ఎలాంటి అంచనాల నడుమ రిలీజ్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం యావత్ మెగాఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూడగా.. ఆ అంచనాలను బీట్ చేస్తూ ఈ సినిమా రికార్డుల పరంపర కొనసాగించింది. ఇప్పటికే రిలీజ్ అయ్యి 20 రోజులు దాటినా ఈ సినిమాకు ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదంటే ఈ సినిమాకున్న ఫాలోయింగ్ ఎలాంటిదో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి యాక్టింగ్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకుపోగా ఈ సినిమా కథ ఆ స్థాయిని మరింత పెంచింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా 20 రోజుల్లో ఏకంగా రూ. 105 కోట్లకు పైగా రాబట్టి మెగా పవర్ ఏమిటో మరోసారి ప్రూవ్ చేసింది. ఇక ఈ సినిమా 20 రోజుల కలెక్షన్లు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి..

ఏరియా – 20 రోజుల కలెక్షన్లు
నైజాం – 32.44 కోట్లు
సీడెడ్ – 19.22 కోట్లు
కృష్ణా – 7.45 కోట్లు
నెల్లూరు – 4.51కోట్లు
గుంటూరు – 9.58 కోట్లు
వైజాగ్ – 16.46 కోట్లు
తూ.గో – 9.12 కోట్లు
ప.గో – 6.55 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 105.23 కోట్లు

Leave a comment