కొమ్ములొచ్చేసిన కామ్రేడ్ బ్యూటీ

తెలుగులో హీరోయిన్లు చాలా తక్కువ కాలం తమ సత్తా చాటుతూ తెరమరుగవుతున్నారు. ఇప్పటికే ఈ కోవలో చాలా మంది భామలు ఇలా వచ్చి అలా వెళ్లిన వారు ఉన్నారు. మహా అంటే ఒక దశాబ్ద కాలం ఏలిన బ్యూటీలను వేళ్లపై లెక్కించవచ్చు. వారిలో సమంత, తమన్నా లాంటి వారు ఉన్నారు. కానీ వీరెప్పుడు తమ హద్దులు మీరి దర్శకనిర్మాతలకు తలనొప్పులు తెచ్చిపెట్టిన దాఖలాలు లేవు.

కానీ నిన్న గాక మొన్న వచ్చిన ఓ కన్నడ బ్యూటీ రెండు హిట్లు కొట్టిందో లేదో తనలోని యాటిట్యూడ్‌ను దర్శకనిర్మాతల ముందు చూపిస్తూ అస్తమానం వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఛలో, గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బ్యూటీ రష్మిక మందనపై అప్పుడే టాలీవుడ్‌లో పుకార్లు మొదలయ్యాయి. ఆమె దర్శకనిర్మాతలకు నచ్చని విధంగా యాటిట్యూడ్ చూపిస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరో గిట్టని వారు మాత్రమే ఆమెను ఇలా దిగజార్చాలని చూస్తున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

అటు సినిమాలపరంగా రష్మికా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు, బన్నీతో ఓ సినిమాతో పాటు పలు సినిమాల్లో నటిస్తోన్న ఈ బ్యూటీ ఇలాంటి వార్తలకు ఎంతవరకు స్పందిస్తుందో చూడాలి.

Leave a comment