భార్య రాలేదని ఆ భర్త ఏం చేశాడో తెలుసా?

పుట్టింటికి వెళ్లిన భార్య ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని ఎదురుచూస్తుంటారు వారి భర్తలు. అయితే తన భార్య ఎంతకీ తన ఇంటికీ రాలేదని పీకల్లోతూ కోపం పెంచుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. భార్య తన వద్దకు రాలేదని అతగాడు చేసిన ఘనకార్యం ఏమిటో తెలిస్తే ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అమీర్‌పేట్‌లోని ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జియాగూడాకు చెందిన సంతోష్(36) వ్యాపారం చేస్తున్నాడు. అతడికి బోరబండకు చెందిన సబితతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. ఇటీవల ఆమె తన పుట్టిల్లుకు వెళ్లి ఎంతకీ తిరిగి రాకపోవడంతో సంతోష్‌కు ఎక్కడలేని కోపం వచ్చింది. దీంతో విచక్షణ కోల్పోయిన అతడు ఓ సీసాలో పెట్రలో తీసుకుని తన బావమరుదుల వాహనాలకు నిప్పటించాడు. దీంతో వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

కాగా సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు. భార్య రాలేదని ఈ భర్త చేసిన ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Leave a comment