బూతు సబ్జెక్టు నుండి వంగ వాకౌట్

అర్జున్ రెడ్డి సినిమాతో బోల్డ్ కంటెంట్‌ను ట్రెండ్ సెట్టర్‌గా మార్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు తన నెక్ట్స్ మూవీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా ఎవరితో ఉంటుందనే విషయం పక్కన బెడితే ఆయన ప్రస్తుతం ఓ వెబ్ సీరీస్‌ను‌ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో లస్ట్ స్టోరీస్ అంటూ సూపర్ సక్సెస్ అయిన అడల్ట్ కెంటెంట్ వెబ్ సీరీస్‌ను తెలుగులోనూ నలుగురు దర్శకులు రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో సందీప్ రెడ్డి వంగా కూడా ఒకరు.

ఇప్పటికే ఈ వెబ్ సీరీస్ షూటింగ్‌ను స్టార్ట్ చేసిన ఆయన ఇప్పుడు ఈ వెబ్ సీరీస్ నుండి వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఇందులో నుండి ఎందుకు వెళ్లిపోయాడనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం ఇది టాలీవుడ్‌ హాట్ టాపిక్‌గా మారింది. అడల్ట్ కంటెంట్‌ను ఎలా ప్రెజెంట్ చేయాలో పర్ఫెక్ట్‌గా తెలిసిన వంగా ఇలా లస్ట్ స్టోరీస్ వంటి వెబ్ సీరీస్ రీమేక్ నుండి ఎందుకు వెళ్లిపోయాడా అని ఆయన అభిమానులు ఆలోచిస్తున్నారు.

ఏదేమైనా ప్రస్తుతం బూతు కంటెంట్ ఉన్న సినిమాలకు, వెబ్ సీరీస్‌లకు పిచ్చ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇలాంటి ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన వెబ్ సీరీస్ నుండి వంగా వాకౌట్ మాత్రం కాస్త నిరాశకు గురి చేసే అంశమే అని చెప్పాలి. మరి ఆయన ప్లేస్‌ను ఎవరు బర్తీ చేస్తారో చూడాలి.

Leave a comment