బాలయ్య బాబు వదులుతున్నాడోచ్!

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చింది. బాలయ్య 105వ సినిమాగా తెరకెక్కుతోన్న సినిమాకు సంబంధించి ఇటీవల పోస్టర్లు రిలీజ్ చేశారు. కానీ సినిమాకు సంబంధించి మరే విషయాన్ని వారు రివీల్ చేయలేదు.

దీంతో తాజాగా అక్టోబర్ 25న ఈ సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఆ అనౌన్స్‌మెంట్ ఏమిటనేది మాత్రం ఇంకా సస్పెన్స్. రేపు రిలీజ్ అయిన తరువాతే ఆ ప్రకటన ఏమిటనేది అందరికీ తెలుస్తోంది. కాగా చిత్ర వర్గాల ప్రకారం అది చిత్ర టైటిల్ పోస్టర్ అయినా లేక సినిమాలోని ముఖ్య పాత్రకు సంబంధించి ఏదైనా ప్రకటన అయి ఉండవచ్చని తెలుస్తోంది.

ఏదేమైతేనేం.. బాలయ్య బాబు ఫ్యాన్స్‌కు రేపు పండగనే చెప్పాలి. ఇటీవల అల్లు అర్జున్, మహేష్ వరుసబెట్టి ఏదో ఒకటి రిలీజ్ చేస్తూ వస్తుండటంతో నందమూరి అభిమానులు ఢీలా పడ్డారు. ఈ దెబ్బతో వారి హుషారు రెట్టింపు ఖాయడం మాత్రం పక్కా.