అసలే లేదంటే… బోయపాటి వచ్చి వెక్కిరించాడు!

నందమూరి బాలకృష్ణ సినిమా వచ్చి చాలా రోజులు అవుతోంది. జైసింహా తరువాత బాలయ్య నుండి మరొక సినిమా రాలేదు. దీంతో బాలయ్య సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ప్రస్తుతం కెఎస్ రవికామర్ దర్శకత్వంలో NBK105 చిత్రంలో బాలయ్య నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ప్రేక్షకులు ఆశగా చూస్తుంటే.. ఇప్పుడు బాలయ్య తరువాత సినిమా గురించిన వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య తన నెక్ట్స్ మూవీని బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించబోయే విషయం తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. అయితే ఈసారి వీరి కాంబినేషన్‌లో రాబోయే సినిమాపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయని.. ఆ సినిమాను కొనేందుకు అప్పుడే బయ్యర్లు ఆసక్తిగా ముందుకొస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అసలే ఇప్పుడునుకుంటున్న రూలర్ సినిమాకు బిజినెస్ జరగడం లేదని అనుకుంటుంటే.. ఈ బోయపాటి శ్రీను చిత్రం ప్రీ-రిలీజ్ గోలేంటంటూ బాలయ్య ఫ్యాన్స్ కస్సుబుస్సులాడుతున్నారు. మరి ప్రస్తుతం బాలయ్య చేస్తున్న రూలర్ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు జనం.

Leave a comment