రాజు గారి గది మనది కాదండోయ్!

ప్రస్తుతం టాలీవుడ్‌లో సీరీస్ చిత్రాల పరంపర సాగుతోంది. ఇప్పటికే వరుసబెట్టి సీరీస్‌ సినిమాలు చేస్తూ తమ సత్తా చాటుతున్నారు దర్శకనిర్మాతలు. కాగా ఇటీవల కాలంలో ఎక్కువగా పేరు సంపాధించిన సీరీస్‌ సినిమా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా రాజుగారిగది అనే చెప్పాలి.

ఇప్పటికే రాజు గారి గది, రాజు గారి గది 2 సినిమాలు బాక్సాఫీస్ జనాలను భయపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల విజయాలతో ఇఫ్పుడు మరోసారి రాజు గారి గది 3 అనే సినిమాతో మనముందుకు వస్తున్నాడు దర్శకుడు ఓంకార్. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌లు, పోస్టర్లు సినిమా విజయానికి బాగా హైప్ క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా తెలుగు సినిమా కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను వేరే భాషనుండి ఎత్తేశాడట ఓంకార్. తమిళంలో తెరకెక్కిన దిల్లుకు దుడ్డు 2 సినిమాను తెలుగులో రాజు గారి గది 3గా తెరకెక్కించాడట ఓంకార్.

మరి ఈ పుకారు ఎంతవరకు నిజం అనేది చిత్ర దర్శకడు ఓంకార్ మాత్రమే చెప్పాలి. ఏదేమైనా మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Leave a comment