భార్యతో కానిచ్చేస్తున్న డైరెక్టర్

ఒకప్పుడు టాలీవుడ్‌లో మెరిసిన డైరెక్టర్లలో కృష్ణ వంశీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అదిరిపోయే సినిమాలతో తనకు తాను బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ డైరెక్టర్ అనేక స్టా్ర్ హీరోలతో సినిమాలు చేసి తన సత్తా చాటాడు. కానీ కాలం గడిచే కొద్ది తన క్రియేటివిటీని దూరం చేసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఫేడవుట్ అయ్యాడు. చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబొర్లా పడ్డాయి. దీంతో ఈ డైరెక్టర్‌తో సినిమాలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

దీంతో ఇప్పుడు ఈ దర్శకుడు తన పంతా మార్చి ఇప్పుడు ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈసారి ఆయన ఏ స్టార్ హీరోనో లేక స్టార్ హీరోయిన్‌తో సినిమా చేయడం లేదు. తన భార్య సీనియర్ నటి రమ్యకృష్ణతో కలిసి ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ డైరెక్టర్. చాలా సెలెక్టివ్‌గా పాత్రలు చేస్తున్న రమ్యకృష్ణ తన భర్తకు ఎంతో అవసరమైన కమ్ బ్యాక్ మూవీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

ఇకపోతే ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ కూడా నటిస్తారట. మరి ఈ సినిమాతోనైనా కృష్ణవంశీ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి. ఇప్పటికైతే ఈ టాపిక్ మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల చూపును తమవైపు తిప్పుకుంది.

Leave a comment