సాహో ఎఫెక్ట్.. ఇక అస్సలు వద్దంటున్న ప్రభాస్!

బాహుబలి సినిమాతో నేషనల్ హీరోగా మారాడు ప్రభాస్. ఆ సినిమా తరువాత ప్రభాస్ సినిమా తీస్తున్నాడంటే అది ఖచ్చితంగా పాన్ ఇండియా మూవీ అనే రేంజ్‌లో ఫిక్స్ అయ్యారు ఆడియెన్స్. ఇక ఇటీవల వచ్చిన సాహో చిత్రం రిలీజ్‌కు ముందు ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో తెలిసిందే. కాగా ఈ సినిమా రిలీజ్ తరువాత సీన్ రివర్స్ అయ్యింది.

సాహో సినిమాకు మిక్సిడ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్లపై భారీ ప్రభావం పడింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్నంత మేర కలెక్షన్స్ రాబట్టకపోవడంతో చిత్ర బయ్యర్లు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. దీంతో ప్రభాస్‌కు గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. సాహో దెబ్బతో ప్రభాస్ ఓ గట్టి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా తన తరువాత చిత్రాలకు అంత భారీ బడ్జెట్లతో తెరకెక్కించవద్దని నిర్మాతలకు తెలిపాడట ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తు్న్న జాన్ సినిమా కూడా తక్కువ బడ్జెట్‌లోనే కంప్లీట్ చేయాలని తెలిపాడట ప్రభాస్. మొత్తానికి సాహో ఎఫెక్ట్ ప్రభాస్‌పై గట్టిగానే పడిందని స్పష్టం అవుతోంది.

Leave a comment