96.. ఏం చేస్తారో సారూ!

యంగ్ హీరో శర్వానంద్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుని వరుస హిట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ హీరో ఇటీవల కాలంలో సరైన హిట్స్ లేక సతమతమవుతున్నాడు. చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడటంతో ఇప్పుడు తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. తమిళంలో సూపర్ సక్సెస్ సాధించిన 96 మూవీని తెలుగులో రీమేక్ చేయనున్నాడు.

అయితే ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర సినిమాకు మంచి హైప్‌ను తీసుకురావడమే కాకుండా అతడి కెరీర్ బెస్ట్ అవుతుందని చిత్ర యూనిట్ అభిప్రాయ పడుతున్నారు. ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరి అమ్మడితో కలిసి శర్వానంద్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందా అని సామ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఏదేమైనా తమిళంలో 96 మూవీకి ఉన్న ఫాలోయింగ్‌ను తెలుగు రీమేక్‌లో కంటిన్యూ చేయిస్తారా లేక సినిమాకు చెడ్డపేరు తీసుకొస్తారా అనే అంశం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Leave a comment