రాములమ్మ రీఎంట్రీ.. రచ్చ మామూలుగా లేదుగా!

తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఆమె ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తుందా అనే ఆసక్తి ఆమె అభిమానుల్లో క్రియేట్ అయ్యింది. కాగా ఆమె లుక్‌ను మాత్రం చిత్ర యూనిట్ రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. తాజాగా దీపావళి కానుకగా విజయశాంతి లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

ఇప్పటికే మహేష్ రెండు పోస్టర్స్‌ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ భారతీ అనే పాత్రలో నటిస్తోన్న విజయశాంతి రాయల్ లుక్‌ను రిలీజ్ చేయడంతో ఆమె ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. ఏమాత్రం తగ్గని అందంతో విజయశాంతి రీఎంట్రీ అదిరిపోయిందంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో మహేష్‌కు ఆమె ఏం అవుతుందో అనే సందేహం అందరి మదిలో మెదులుతోంది. కాగా ఈ సినిమాలో విజయశాంతి పాత్ర చాలా కీలకం అని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వస్తోన్నారు.

ఇక ఈ సినిమాలో విజయశాంతి పాత్ర ఎలా అలరించనుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. కాగా దీపావళి కానుకగా డబుల్ ట్రీట్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం మహేష్‌కు సంబంధించిన మరో లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు. మరి ఈ లుక్‌లో మహేష్‌ ఎలా ఉండబోతున్నాడా అనే ఆతృత ప్రేక్షకుల్లో ఏర్పడింది.

Leave a comment