డబ్బు కోసమే చేశానంటున్న పాయల్ పాప!

ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌లుగా మారిన వారు చాలా మందే ఉన్నారు. ముందుగా ఈ కోవలో మనకు ఠక్కున గుర్తుకొచ్చేది హీరోలు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ కొట్టేశాడు హీరో విజయ్ దేవరకొండ. ఇక హీరోయిన్లు కూడా ఇదే కోవలో ఓవర్‌నైట్ స్టార్లుగా ఎదిగిన వారు ఉన్నారు. వారిలో RX100 సినిమాతో టాలీవుడ్ యువతకు పిచ్చెక్కించిన పాయల్ రాజ్‌పుత్ ఇప్పుడు మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

తాజాగా ఈ బ్యూటీ నటించిన ‘RDX లవ్’ సినిమా టాలీవుడ్‌లో రిలీజ్ అయ్యి మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఏదేమైనా ఈ సినిమా రివ్యూల పరంగా చూస్తే పెద్ద మేటర్ లేదని తెలుస్తోంది. మరి ఇలాంటి సినిమాను పాయల్ ఎందుకు చేసిందనే డౌట్ రావచ్చు. అయితే ఈ సినిమాను పాయల్ కేవలం రెమ్యునరేషన్‌ కోసం మాత్రమే చేసింది. రెమ్యునరేషన్ భారీ మొత్తంలో ఉండటంతో ఈ బ్యూటీ సినిమాను చేసిందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పాయల్ చేతిలో రెండు పెద్ద సినిమాలే ఉన్నాయి. వెంకీమామ, డిస్కో రాజా అనే రెండు సినిమాలు చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్‌ ఆయా సినిమాల్లో చేసే పాత్రలు ఎంతమేర మెప్పిస్తాయో చూడాలి అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

ఇక ఆమె చేస్తున్న రెండు సినిమాలు కూడా ఆమె కెరీర్‌కు ఎలాంటి విజయాన్ని సాధిస్తాయో అనే విషయం పక్కనబెడితే ఆ సినిమాలు ఆమెకు ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి అంటున్నారు చిత్ర విశ్లేషకులు.

Leave a comment