దీపావళి టపాసులు రెడీ చేసిన బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్‌టైనర్‌ ‘అల వైకుంఠపురములో’ ఇప్పటికే సూపర్ క్రేజ్ సాధించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మొదులకొని టీజర్, ఫస్ట్ సాంగ్ వరకు అదిరిపోయే రెస్పాన్స్‌ తెచ్చుకుంది. అయితే దసరాకు చిత్ర యూనిట్ ఏదైనా అదిరిపోయే ట్రీట్ ఇస్తారేమో అని ఆశగా చూశారు ఫ్యాన్స్.

కానీ వాళ్లకి తెలియని విషయం ఏమిటంటే.. త్రివిక్రమ్ దీపావళి కానుకగా అదిరిపోయే టపాసులు రెడీ చేస్తు్న్నాడు. దీపావళి కానుకగా అల వైకుంఠపురము చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ టీజర్ ఏ రేంజ్‌లో ఉండబోతుందా అని కొందరు ఆయన్ను అడగ్గా దీపావళి పేలపోయే అతిపెద్ద బాంబు ఇదే అని అన్నారట. అంటే ఆ రేంజ్‌లో ఈ సినిమా టీజర్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఫుల్ ధీమాగా ఉన్నారు.

ఇక బన్నీ ఫ్యాన్స్ అప్పుడే దీపావళి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టీజర్‌కు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయాలా అని ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా అల వైకుంఠపురములో టీజర్ యూట్యూబ్‌ను రఫ్ఫాడించేందుకు త్రివిక్రమ్ భారీ ప్లాన్ చేశాడని స్పషమవుతుంది.

Leave a comment