చిరును ఓడగొట్టిని హీరోలు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రెస్టీజియస్ మూవీ సైరా నరసింహారెడ్డి కోసం యావత్ టాలీవుడ్ ఆతృతగా ఎదురుచూశారు. ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత సైరా సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో మనం చూశాం. బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో చెడుగుడు ఆడాడు సైరా నరసింహారెడ్డి. కానీ ఇదే సమయంలో చిరు వేరే హీరోల చేతిలో ఓడిపోయాడంటే మీరు నమ్మగలరా..? కానీ ఇదే జరిగింది.

చిరంజీవి సైరా రిలీజ్ అయిన సమయంలో బాలీవుడ్‌లో వార్ అనే సినిమా కూడా రిలీజ్ అయ్యింది. కండల వీరుడు హృతిక్ రోషన్, టైగర్ శ్రాఫ్ కలిసి నటించిన ఈ భారీ యాక్షన్ మూవీకి జనం నీరాజనం పట్టారు. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులతో ఈ సినిమాకు పిచ్చ ఫాలోయింగ్ రావడంతో ఈ సినిమా వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఈ ఏడాది భారత్‌తో అత్యంత ఎక్కువగా కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

అయితే తెలుగులో మాత్రం ఏ ఏడాది ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా సైరా నిలిచింది. కానీ పాన్ ఇండియా మూవీగా వచ్చిన సైరా ఒక్క తెలుగులో తప్పితే మిగతా అన్ని భాషల్లో బిచానా ఎత్తేసింది.

Leave a comment