Gossipsగోవింద ఆచార్యగా వస్తోన్న మెగాస్టార్?

గోవింద ఆచార్యగా వస్తోన్న మెగాస్టార్?

మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ సైరా నరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం చిరు చేసిన హార్డ్ వర్క్ మనకు ఆ సినిమా చూసినంత సేపూ కనిపించింది. ఇక ఈ ప్రెస్టీజియస్ మూవీని ఆయన కొడుకు రామ్ చరణ్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ కావడం, హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడం రెండూ జరిగిపోయాయి.

ఇప్పుడు మెగాస్టార్ మరోసారి టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయ్యారు. సైరా షూటింగ్ సమయంలోనే ఆయన తన నెక్ట్స్ మూవీని ఓకే చేశారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరు 152వ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ వైరల్‌గా మారింది. చిరు కొత్త లుక్‌లో కనిపిస్తున్న ఆ పోస్టర్‌పై సినిమా పేరును కూడా రివీల్ చేశారు. ‘గోవింద ఆచార్య’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ ఈ సినిమాకు పర్ఫెక్ట్ యాప్ట్ అని నెటిజన్లు అంటున్నారు.

అయితే ఇదంతా కేవలం ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని తెలుసుకుని వారు షాక్‌కు గురయ్యారు. అచ్చం అఫీషియల్ పోస్టర్‌ను పోలి ఉన్న ఈ పోస్టర్‌కు మెగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఈ పోస్టర్‌ను తెగ షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news