విడాకులు తీసుకున్న మంచు మనోజ్

మంచు కుటుంబంలో మరో వివాదం చెలరేగింది. అసలు ఎలాంటి కాంట్రోవర్సీలకు వెళ్లని మంచు కుటుంబంలో తీవ్ర కలకలం రేగింది. మోహన్ బాబు రెండో కొడుకు మంచు మనోజ్ చిన్నప్పట్నుంచే సినిమాల్లో చేస్తూ వస్తు్న్నాడు. అయితే హీరోగా కూడా పలు సినిమాలు చేశాడు. కానీ అంతగా సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను బిల్డ్ చేసుకోలేకపోయాడు. ఆ తరువాత తన చిన్ననాటి గర్ల్‌ఫ్రెండ్ ప్రణతి రెడ్డిని 2015 మే 20న వివాహం చేసుకుని చక్కటి జీవితాన్ని అనుభవిస్తు్నాడు.

కానీ ఇప్పుడు వారు వేరుపడినట్లు స్వయంగా మంచు మనోజ్ వెల్లడించారు. మంచు మనోజ్, ప్రణతి రెడ్డిల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఎక్కువవడంతో వారిద్దరు విడాకులు తీసుకునేందుకు నిశ్చయించుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని రివీల్ చేశాడు. చాలా బాధాకరంగా ఈ నిర్ణయం తీసుకున్నానంటూ మనోజ్ తన బాధను వెల్లడించాడు.

mm

ఏదేమైనా మంచు మనోజ్, ప్రణతి రెడ్డిల విడాకుల విషయం తెలుసుకున్న మంచు కుటుంబ శ్రేయోభిలాషులు చాలా ఫీలవుతున్నారు. ఏం జరిగినా అంత మనమంచికే అంటూ మనోజ్ చెప్పుకొచ్చాడు.

Leave a comment