సరిలేరు నీకెవ్వరు.. మళ్లీ ఎందుకో గురు?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరూ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో మహేష్ ఓ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో మనకు కనిపిస్తాడు.

ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా కథ, కథనం పట్ల అనిల్ రావిపూడి చూపించిన శ్రద్ధ మహేష్‌ను చాలా బాగా ఇంప్రెస్ చేశాయట. దీంతో అనిల్‌తో మరో సినిమా చేయాలని ఆయన కోరాడట. ఇదే విషయాన్ని అనిల్ రావిపూడితో చర్చిస్తే ఆయన కూడా దానికి ఓకే చెప్పాడట. అయితే మహేష్ కోసం మరో డిఫరెంట్ కథను రెడీ చేయాల్సిందిగా అనిల్‌ను కోరాడట మహేష్.

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా 2020 చివరిలో మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని అత్యంత క్రేజ్ మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

Leave a comment