మరింత రెచ్చిపోతున్న ఆమె

బాలీవుడ్‌లో ఈ మధ్యకాలం వెబ్ సీరీస్ హవా ఎక్కువగా నడుస్తోంది. ఇప్పటికే లస్ట్ స్టోరీస్ అనే సీరీస్ అందులో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఏకంగా నలుగురు స్టార్ డైరెక్టర్లు తెరకెక్కించిన ఈ వెబ్ సీరీస్‌లో పేరున్న నటులు నటించడంతో జనాలు దానికి బాగా కనెక్ట్ అయ్యిరు. ఇక ఈ సీరీస్‌ను ఇప్పుడు తెలుగులో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా మొదలెట్టినట్లు తెలుస్తోంది.

తెలుగులో దర్శకులు నందిని రెడ్డి, సందీప్ రెడ్డి వంగా, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ కలిసి ఈ వెబ్ సీరీస్‌ను డైరెక్ట్ చేయనున్నారు. ఇక ఈ వెబ్ సీరీస్‌లో ప్రముఖ నటి అమలా పాల్ నటించనుంది. ప్రేక్షకులకు వేడి పుట్టించే పాత్రలో అమ్మడు నటించనున్నట్లు తెలుస్తోంది. ఈమె పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇక మరో ముఖ్య పాత్రలో నటుడు జగపతి బాబు నటిస్తున్నట్లు తెలుస్తోంది.

మిగతా ముగ్గురు దర్శకులు ఈ వెబ్ సీరీస్‌కు సంబంధించిన స్క్రిప్టు పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి బాలీవుడ్‌లో బిగ్ సక్సెస్ కొట్టిన ఈ సీరీస్ తెలుగు ప్రేక్షకులకు ఎంతమేర నచ్చుతుందో చూడాలి. ఏదేమైనా ఈ సీరీస్ కోసం తెలుగు ఆడియెన్స్ ఆసక్తిగానే చూస్తున్నారు.

Leave a comment