అరుదైన ఘనత సొంతం చేసుకున్న F2

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ F2 గత సంక్రాంతికి రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించుకుంది. వెంకీ కామెడీ సినిమాకు బాగా కలిసి రావడం, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెద్దపీట వేయడంతో ఈ సినిమా సంక్రాంతి బరిలో విజేతగా నిలిచింది. ఇక ఈ సినిమా ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది.

ప్రతిఏటా నిర్వహించే ఇండియన్ పనోరమా ఫెస్టివల్‌కు ఎఫ్2 చిత్రం ఎంపిక అయ్యింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. గోవాలో జరిగే ఈ ఫెస్టివల్‌లో ఎఫ్2 చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ ఫెస్టివల్ నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది.

సంక్రాంతి బరిలో సక్సెస్ కొట్టిన సినిమా ఇప్పుడు మరో ఫీట్ సాధించడంతో చిత్ర యూనిట్ తమ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. కాగా ప్రస్తుతం వెంకటేష్ వెంకీ మామ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Leave a comment