వరుణ్ తేజ్ వాల్మీకి ట్రైల‌ర్‌…!

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సినిమా వాల్మీకి ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నారు. చదువుకునే ద‌శ‌ నుంచే రఫ్ అండ్ టఫ్ గా ఉండే వ్యక్తిగా వ‌రుణ్‌తేజ్‌ కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో గద్దలకొండ గణేష్ అలియాస్ ఘనిగా వరుణ్ నటిస్తున్నాడు.

కాలేజీలో సరదాగా పూజా హెగ్డే ప్రేమికుడిగా కనిపించనున్న‌ వరుణ్ తేజ్ ఎందుకు అలా గ్యాంగ్ స్టర్ గా మారాల్సి వచ్చింది అనే విషయాలను సినిమాలో చూపించబోతున్నారు. మేకింగ్ పరంగా సినిమా సూపర్ గా ఉన్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతున్నది. వరుణ్ లోని మరో యాంగిల్ ను సినిమాలో చూపించినట్టు సినిమా ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

1980 కాలంకు చెందిన వ్య‌క్తిగా వ‌రుణ్‌తేజ్ ఈసినిమాలో బాటంబెలూన్ ప్యాంట్ వేసుకుని పెరిగిన జుట్టుతో క‌నిపించ‌నున్నాడు. తెలంగాణా యాసలో వరుణ్ చెప్పిన డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. సెప్టెంబర్ 20 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది. నాపై పందాలేస్తే గెలుస్తారు.. నాతో పందాలేస్తే చస్తారు అనే డైలాగ్ సూపర్బ్. గబ్బర్ సింగ్ లో పోలీస్ స్టేషన్ లో అంత్యాక్షరి టైప్ కామెడీని ఇందులో ట్రై చేసినట్టుగా తెలుస్తోంది. ట్రైల‌ర్‌ను చూస్తే సినిమాపై భారీ హైప్ క్రియోట్ అవుతుంది. సినిమాకు ట్రైల‌ర్ మంచి బూస్టింగ్‌గా నిలువ‌నున్న‌ట్లు సిని ప‌రిశీల‌కులు అంటున్నారు.

Leave a comment