గోపీచంద్ చాణ‌క్య టీజ‌ర్‌…!

యాక్ష‌న్ హీరో గోపీచంద్ హీరోగా న‌టిస్తున్న చిత్రం చాణక్య. ఈ సినిమా టీజర్ ఈరోజు కొద్ది సేప‌టి క్రితం రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌. ఏకె ఎంటర్టైనర్ నిర్మిస్తున్న ఈ సినిమాను తిరు దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కింది. ఇందులో గోపీచంద్ స్పై గా కనిపిస్తున్నారు. పాకిస్తాన్ ఓ మిషన్ ను చేపట్టేందుకు సీక్రెట్ ఏజెంట్ గా అక్కడికి వెళ్తాడు.

పాకిస్తాన్‌లో గోపీచంద్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. గోపీచంద్ కు అప్పగించిన బాధ్యతలను సంక్రమంగా నిర్వహించాడా లేదా అనేది సినిమా క‌థ అని గ‌తంలో ప్ర‌చారం జ‌రుగుతుంది. గతంలో పాక్ తో సంబంధం ఉన్న కథతో గోపిచంద్ సాహసం చేశారు. ఆ సినిమా మంచి విజయన్ని సొంతం చేసుకుంది. చంద్రశేఖర్ ఏలేటి ఆ సినిమాకు దర్శకుడు. ఈ ట్రైల‌ర్‌తో సినిమాకు భారీ హైప్ క్రియోట్ అవుతున్న‌ది.

కాగా గోపీచంద్‌కు సౌఖ్యం సినిమా త‌రువాత స‌రియైన హిట్లు లేక‌పోవ‌డంతో ఇప్పుడు ఈ సినిమా త‌ప్ప‌కుండా హిట్ సాధించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అందుకే ఓ రా ఆఫీస‌ర్‌గా పాక్ నేపధ్యం కలిగిన కథతో తిరు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. దసరాకు కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది. ఈ మూవీ హిట్టయితే గోపీచంద్ తిరిగి లైన్లోకి వచ్చినట్టే అవుతుంది. కాగా ఈసినిమా అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ స‌న్న‌ద్దం చేస్తున్నారు.

Leave a comment