నాగ చైత‌న్య కొత్త సినిమాకు కొబ్బ‌రి కాయ కొట్టాడుగా…!!

టాలీవుడ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య‌, క్రేజీ హీరోయిన్ సాయిప‌ల్ల‌వి జంట‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్ లో తెర‌కెక్కె చిత్రంకు కొబ్బ‌రి కాయ కొట్టారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ పై అమిగోస్ క్రియోష‌న్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మూహూర్తంను ఈ రోజు ప్రారంభించారు.

నాగ‌చైన‌త్య కేరీర్‌లో ఇది 20వ సినిమాగా తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌, హీరో నాగ‌చైత‌న్య‌, హీరోయిన్ సాయి ప‌ల్ల‌విలు ఇప్పుడు ఒకే కాంబినేష‌న్‌లో ఓ ప్రాజెక్టు చేస్తున్నారు. ఈ సినిమా ఇక రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లోనే జ‌రుపుకోనున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

హీరో నాగ‌చైత‌న్య ఇప్ప‌టికే త‌న భార్య, న‌టీ స‌మంత‌తో క‌లిసి మ‌జిలి సినిమాలో న‌టించాడు. ఈసినిమా బాక్సాఫీసు వ‌ద్ద మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇక సాయిప‌ల్ల‌వి కూడా ఫిదా సినిమాతో శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలోనే సిని రంగ ప్ర‌వేశం చేసింది. ప‌క్కింటి అమ్మాయిగా ఉండే సాయిప‌ల్ల‌వి ప్ర‌స్తుతం వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న విరాట ప‌ర్వం సినిమాలో న‌టిస్తుంది. ఇప్పుడు ఇద్ద‌రు క‌లిసి జంట‌గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నారు.

Leave a comment