మళ్లీ పుట్టిన అతిలోక సుందరి.. ఫ్యాన్స్ సంతోషానికి అవధుల్లేవు!

అతిలోక సుందరిగా పేరు సంపాదించిన ఎవర్‌గ్రీన్ బ్యూటీ శ్రీదేవి తెలుగునాట ఎలాంటి ముద్ర మిగిల్చిందో అందరికీ తెలిసిందే. పదహారేళ్ల వయసు సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ తక్కువ సమయంలో కోట్లాది ప్రేక్షకుల మన్ననలు పొందింది. అదే క్రేజ్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ అక్కడ కూడా సూపర్ సక్సెస్ సాధించింది. కానీ దేవుడు చిన్నచూపు చూడటంతో కోట్లాది అభిమానుల మనసులను గాయపరుస్తూ ఈ సుందరి లోకాన్ని విడిచి వెళ్లింది. శ్రీదేవి మరణంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు షాక్‌కు గురయ్యారు. కాగా ఇప్పుడు ఆమె మళ్లీ పుట్టిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

సింగపూర్‌లోని ప్రసిద్ధి చెందిన మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో నటి శ్రీదేవి విగ్రహాన్ని సెప్టెంబర్ 4న ఆవిష్కరించనున్నారు. కేవలం తన అందంతో కాకుండా నటనతో కోట్లాది ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాధించిన ఈ బ్యూటీ విగ్రహాన్ని ఆమె కూతురు జాన్వీ కపూర్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. కాగా శ్రీదేవి విగ్రహం చూస్తే ఆమె మళ్లీ పుట్టిందంటున్నారు ఆమె ఫ్యాన్స్.

అభిమానులను విషాదంలో వదిలి వెళ్లిన శ్రీదేవి ఈ విధంగా తన అభిమానులు మరోసారి చేరువ కానుంది. అయితే ఈసారి శ్రీదేవిని చూడాలంటే మాత్రం సింగపూర్ దాకా వెళ్లాల్సిందే అంటున్నారు సినీ జనాలు. శ్రీదేవి లేకున్నా ఆమె విగ్రహాన్ని చూసి సంతోషిస్తామంటున్నారు ఆమె అభిమానులు.

Leave a comment