రెచ్చిపోయిన బాలయ్య.. మళ్లీ ఆ పాపతోనే దబిడిదిబిడి!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య కొత్త లుక్ ఇప్పటికే పలు పోస్టర్ల రూపంలో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య మధ్యవయస్కుడి పాత్రలో ఉండే ఆ గెటప్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా థాయిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం బాలయ్, సోనాల్ చౌహాన్‌లపై ఓ సాంగ్ చిత్రీకరిస్తోంది. గతంలోనూ బాలయ్య ఈ పాపతో లెజెండ్, డిక్టేటర్ సినిమాల్లో ఆడిపాడాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సోనాల్‌తో బాలయ్య రొమాన్స్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మరో హీరోయిన్‌గా వేదిక ఈ సినిమాలో నటిస్తోంది.

బాలయ్య కెరీర్‌లో 105వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఇప్పటివరకు టైటిల్ పెట్టలేదు. కాగా ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.