రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘సాహో’ రిలీజ్‌కు ముందు ఎలాంటి ప్రభంజనం సృష్టంచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ కావడంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను పాతర వేస్తుందా అని ఆతృతగా చూశారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా టిక్కెట్ల బుకింగ్‌లకు ఏర్పడ్డ క్రేజ్‌తో ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఓ రేంజ్ రికార్డు క్రియేట్ చేయడం ఖాయం అనుకున్నారు అంతా. కానీ సినిమా రిలీజ్ కావడంతో అన్ని అంచనాలు తలక్రిందులయ్యాయి.
సినిమాకు బజ్ భీబత్సంగా ఉన్నప్పటికీ.. నెగెటివ్ మౌత్‌టాక్, యావరేజ్ రివ్యూలతో జనంలో సినిమాపై ఆసక్తి తగ్గింది. ముఖ్యంగా ఓవర్సీస్ జనం ప్రీమియర్ షోల రివ్యూలతోనే ఈ సినిమాపై ఓ నిర్ణయానికి వచ్చేసి దీనిని దూరం పెడుతున్నారు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ జోరుగు ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగుతోంది. ఇప్పటికే ఒక్క నార్త్ అమెరికాలోనే సాహో చిత్రం ఏకంగా 2 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. ఓవర్సీస్ బాక్సాఫీస్‌కు చుక్కలు చూపిస్తున్నట్లు ఉన్నా ఈ కలెక్షన్లు సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమాకు చాలా తక్కువనే చెప్పాలి. ఏకంగా 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు 2 మిలియన్ డాలర్ల వసూళ్లు తక్కువనే చెప్పాలి.
ఏదేమైనా నెగెటివ్ మౌత్‌టాక్, యావరేజ్ రివ్యూలు సాహో చిత్రానికి దెబ్బేశాయని చెప్పాలి. ఇంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద ఏదైనా అద్భతం జరగాల్సిందే అంటున్నారు సినీ జనాలు. మరి ప్రభాస్ సాహో చిత్రం బయ్యర్లను చివరకు ఏం చేస్తుందో చూడాలి.