అదరగొట్టిన అల వైకుంఠపురములో కొత్త పోస్టర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో చిత్రం షూటింగ్‌ ఇప్పటికే జరుగుతోన్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ఎలాంటి సంచనాలకు తెరతీస్తుందో అని ఆసక్తిగా చూస్తున్నారు ప్రేక్షకులు. కాగా ఇప్పటికే ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోంది.

తాజాగా ఈ సినిమా మొదటి లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్ సినీ ప్రేక్షకలను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో బన్నీ సూటు వేసుకొని ఓ కుర్చీ పై కూర్చుని స్టైల్‌గా సిగరెట్‌ను ఓ సెక్యూరిటీ గార్డు ద్వారా వెలిగించుకుంటాడు. ఈ పోస్టర్ చూస్తే చాలా మందికి చాలా రకాలుగా సినిమా కథను అర్ధం అయ్యేలా ఉంది. ఏదేమైనా బన్నీ ఈ సారి ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో మనముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.

త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు. కాగా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో సినిమా రిలీజ్ అయిన తరువాత మాత్రమే తెలుస్తోంది.

Leave a comment