ప‌క్క‌లోకి ర‌మ్మంటున్న ద‌ర్శ‌కుడు…!!

అత‌డో సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు. న‌టుడు కూడా. ఆయ‌న న‌ట‌న ఎంతో అద్భుతంగా ఉంటుంది. సినిమాను కూడా అంతే అద్భుతంగా తెర‌కెక్కించ‌గ‌ల‌డ‌నే ప్ర‌తీతి. ఇప్పుడు అదే ద‌ర్శ‌కుడు ఓ న‌టిని లైంగికంగా వేధిస్తున్న‌ట్లు ఆరోపిస్తుండ‌టం విశేషం. ఆ ద‌ర్శ‌కుడు వేధింపులు తాళలేక పోతున్నాన‌ని అంటూ ఆవేధ‌న చెందిన మీడియాకెక్కింది..

ఇంత‌కు ఓ న‌టిని లైంగికంగా, వృత్తి ప‌రంగా వేధింపుల‌కు గురి చేస్తున్న ద‌ర్శ‌కుడు ఎవ‌రు. సినిమాలో అవ‌కాశాలు రాకుండా ఆ న‌టిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు ర‌విబాబు. అనేక సినిమాల్లో కారెక్ట‌ర్ న‌టుడిగా, సైడ్ విల‌న్‌గా న‌టించడ‌మే కాకుండా, కొన్ని సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు ర‌విబాబు. నువ్విలా సినిమాలో త‌న‌తో పాటు క‌లిసి న‌టించిన శిరీషా అనే న‌టిని లైంగికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నాడ‌ట‌.

యాబైకి పైగా సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, ఐటెంగ‌ర్ల్‌గా న‌టించిన శిరీషా, ర‌విబాబు నువ్విలా సినిమాలో న‌టించింద‌ట‌. అప్ప‌టి నుంచి లైంగికంగా వేధిస్తున్నాడ‌ట‌. నీ రేటు ఎంత అంటూ బూతులు మాట్లాడుతున్నాడ‌ట‌. సినిమాల్లో అవ‌కాశాలు రాకుండా ఇత‌ర ద‌ర్శ‌కులు, సిని ప‌రిశ్ర‌మ‌లోని కొంద‌రికి ఫోన్లు చేస్తున్నాడ‌ట‌. బూతు మెసెజ్‌లు పెడుతూ ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాడ‌. అత‌డి ప‌క్క‌లోకి వెళితేనే బ‌తుకు ఉంట‌ద‌ట‌.. లేకుంటే అవకాశాలు రాకుండా చేస్తాడ‌ట‌.. ఇప్ప‌టికే తిండికి లేక అవ‌స్థ‌లు ప‌డుతున్న నాకు ఆ ద‌ర్శ‌కుడి నుంచి ప్రాణ భ‌యం ఉందంటూ మెసెజ్‌ల‌ను చూపుతూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది శిరీషా.. సో ర‌విబాబు ఎలా స్పందిస్తాడో చూడాల్సిందే…

Leave a comment