జయల‌లితగా రమ్యకృష్ణ లుక్ ఇదే…!!

ద‌క్షిణ భార‌త దేశంలోని త‌మిళ‌నాడులో ఆమే ఒక సంచ‌ల‌నం. రాజ‌కీయాల‌ను త‌న క‌నుస‌న్న‌ల్లో శాషించిన ఆమే మ‌ర‌ణం మాత్రం చాలా విషాదాంతం అయింది. ఆమే సినిమాల్లో ఓ కెర‌టం. రాజ‌కీయాల్లో త‌ళైవి. అయితే ఆమే జీవితంలో అనుకోని మ‌లుపులు తీసుకుంది. ఇప్పుడు ఆమే జీవితంను బ‌యోపిక్‌గా తెర‌కెక్కించేందుకు అనేక‌మంది ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ముందుకు వ‌చ్చారు. జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌గా వ‌స్తున్న చిత్రం క్విన్‌.

ప్రస్తుతం త‌మిళంలో క్విన్‌గా జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ రూపొందిస్తున్నారు. ఇందులో జ‌య‌లలిత పాత్ర‌దారిగా ప్రముఖ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ న‌టిస్తున్నారు. ఇప్పుడు ర‌మ్య‌కృష్ణ జ‌య‌ల‌లిత పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ప్రేక్ష‌కుల‌ను ఉద్దేశించి మాట్లాడుతున్న చిత్రాన్ని వెనుక‌వైపు నుంచి ర‌మ్య‌కృష్ణను షూట్ చేసిన చిత్రాన్ని సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.

క్వీన్ అనే పేరుతో వెబ్ సిరీస్ గా వ‌స్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. తెల్ల చీర ధ‌రించి, జెండా అంచు క‌లిన‌ది ధ‌రించి వేదిక‌పై ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తున్న ఈ ఫోటో ఎంతో ఆస‌క్తి క‌రంగా ఉంది. ఈసినిమాను ద‌క్షిణ భార‌త దేశంలో ఉన్న ప‌లు భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ ఆలోచ‌న చేస్తుంద‌ట‌. ద‌క్షిణ భార‌తంలో త‌న‌దైన ముద్ర వేసుకున్న జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ఎంద‌రికో ఆద‌ర్శంగా ఉండ‌నుంది.

Leave a comment