వైర‌ల్‌గా మారిన నాగ్ టాటూ..అర్ధమేంటో తెలుసా ?

టాలీవుడ్ మ‌న్మ‌థుడు ఎవ‌రంటే ట‌క్కున స‌మాధానం వ‌చ్చేది అక్కినేని నాగార్జున‌. మ‌రి టాలీవుడ్ కింగ్ ఎవ‌రంటే దానికి స‌మాధానం నాగార్జునే అంటారు.. అలాంటి టాలీవుడ్ మ‌న్మ‌థుడు, కింగ్ నాగార్జున ఇప్పుడు ఓ విష‌యంలో తెగ వైర‌ల్ అవుతున్నాడు.. మ‌న్మ‌థుడిగా రాణించి మ‌న్మ‌థుడు 2గా మెప్పించ‌లేక పోయిన నాగార్జున ఇప్పుడు బిగ్‌బాస్ 3 సీజ‌న్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

అయితే నాగార్జున ట్రెండ్‌కు త‌గిన‌ట్లుగా ప‌రిస్థితుల‌కు అనుగుణంగా త‌న వేషాల‌ను మార్చుకుంటాడు.. అలాంటి నాగార్జున నిత్యం త‌న కొడుకుల‌తో కూడా పోటీ ప‌డుతూ ఉంటాడ‌ని అనేక‌సార్లు రుజువైంది. ఇప్పుడు నాగార్జున త‌న కొడుకులులైన నాగ‌చైత‌న్య‌, అఖిల్‌ను మించిపోయాడంటే న‌మ్మండి.. అందుకే ప్ర‌స్తుత ట్రెండ్ ప్ర‌కారం చేతికి పెద్ద టాటూతో బిగ్‌బాస్ 3 షోలో ద‌ర్శ‌న‌మిచ్చి అంద‌రిని షాక్ కు గురిచేశాడు.

నాగార్జున చేతిపై ఉన్న టాటూ ను హీరో నానీ గ‌మ‌నించి దాని కథను చెప్పాలని నాని కోరడం, హౌస్ మేట్స్ అడగడంతో నాగార్జున తన ఎడమ చేతిపై ఉన్న దిక్చూచి, నాగుపాము కాంబినేష‌న్‌లో ఉన్న టాటూ గుట్టు విప్పాడు. నాగుపాము కుబుసాన్ని విడిచిపెడుతుంది. నేను కూడా గతాన్ని గురించి అసలు పట్టించుకోను. దానిపైన ఉన్న కన్ను నాదే. జీవితంలో కొత్త విషయాలను వెతుక్కుంటూ ఉంటానన్న గుర్తుకు కన్ను బొమ్మ. కంపాస్(దిక్సూచి)పైన ఉన్న ఎన్ అనే అక్షరం ఉత్తర దిక్కు కావొచ్చు లేదా నా పేరు కూడా కావొచ్చు. చివరిగా సంతోషం అనేది గుండెల్లోనే ఉంటుందని చెప్పడం దీనర్ధం ముక్తాయించాడు.

Leave a comment