ఇలియాన బ్రేక‌ప్‌కు కార‌ణ‌మిదేనా…!

ప్ర‌ముఖుల ప్రేమ‌లు పెళ్లిపీట‌ల దాకా వెళ్ళ‌డం… పెళ్ళీపీట‌ల దాకా వెళ్ళ‌గానే అక్క‌డే అనుకోకుండా ఆగిపోవ‌డాలు… లేక‌పోతే పెండ్లి పీట‌లెక్కిన త‌రువాత ఇద్ద‌రి న‌డుమ ఇగోలు రావ‌డం, బ్రేక‌ప్‌లు కావ‌డం ఇవి స‌ర్వ‌సాధార‌ణ‌మే. అయితే సినిమా ప్ర‌పంచంలోనూ ఇది ఇంకా కామ‌న్‌. సినిమా హీరోయిన్ల‌తో వ్యాపార‌వేత్త‌లు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునుగుతారు.. త‌రువాత బ్ర‌మ‌లు తీరిపోగానే బ్రేక‌ప్ చెప్ప‌డం ఇది మ‌నం చూస్తేనే ఉన్నాం.

ఇప్పుడు ఇదే కోవ‌లోకి వ‌చ్చింది టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా. తెలుగులో అనేక సినిమాల్లో ఇలియాన న‌టించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎన్నో హిట్ చిత్రాల‌లో న‌టించిన ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ఇలియానా త‌న ప్రేమ వ్య‌వ‌హారంలో మాత్రం హిట్ కాలేకపోయింది. త‌ను ప్రేమించిన చెలికాడు అండ్రూతో బ్రేక‌ప్ కావ‌డానికి కేవ‌లం డ‌బ్బే కార‌ణ‌మ‌ట‌. ఇలియానా వాస్త‌వానికి పెండ్లి చేసుకుని సినిమాల‌కు గుడ్‌బై చెప్పి ఇంట్లోనే ఉండాల‌ని నిర్ణ‌యించుకుంది.

ఇలియానా అండ్రుతో చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరిగి తిరిగి బికారి అయ్యాడ‌ట‌. ముందుగా ఇలియానాను పెండ్లి చేసుకున్న త‌రువాత సినిమా న‌ట‌న‌కు గుడ్ బై చెప్పాల‌ని ముందుగానే అండ్రు కండిష‌న్ పెట్టాడ‌ట‌. అయితే అండ్రూకు డ‌బ్బులు రాక‌పోవ‌డంతో క‌ష్టాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ట‌. దీంతో అండ్రూ ఇలియానాను మ‌ళ్ళీ సినిమాల్లో న‌టించి డ‌బ్బులు సంపాదించాల‌ని ఒత్తిడి తెచ్చాడ‌ట‌. దీంతో కుద‌ర‌ద‌ని ఇలియానా చెప్ప‌డంతో అండ్రూ ప్రేమ బ్రేక‌ప్‌కు దారితీసింద‌ట‌.. సో ఇదండి ఇలియానా బ్రేక‌ప్ క‌థ‌.

Leave a comment