సైరాపై బన్నీ హాట్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా న‌టిస్తున్న చిత్రం సైరా. ఓ వీరుడి గాథ‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మం జోరుగా సాగుతుంది. సినిమా విడుద‌ల‌కు మ‌రో రెండు రోజులే ఉండ‌టంతో మెగా హీరోలంతా త‌మ‌కు తోచిన విధంగా సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొని సినిమాపై హైప్ పెంచుతున్నారు. అయితే గ‌త కొన్ని రోజులుగా మెగా హీరో, స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ మాత్రం త‌న మేన‌మామ సినిమా ప్ర‌మోష‌న్‌కు దూరంగా ఉన్నాడు.

సైరా మూవీ గురించి మెగా హీరోలంతా ఇప్పటికే మాట్లాడారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సినిమాగా అభివర్ణించారు. ఈ సినిమాను నిర్మించడం రామ్ చరణ్ కే సాధ్యం అయ్యిందని, తన కెరీర్లో బెస్ట్ నిర్మాత రామ్ చరణ్ అని మెగాస్టార్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఈ సినిమాపై మెగా హీరోలంతా స్పందిస్తున్నా అల్లు అర్జున్ క‌నీసం స్పందించ‌కుండా దూరంగా ఉంటున్నారు. దీంతో అల్లు అర్జున్‌పైన అటు మెగా ఫ్యాన్స్‌, ఇటు సోష‌ల్ మీడియాలో అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అల్లు అర్జున్ ఎట్ట‌కేల‌కు స్పందించాడు,

తాజాగా అల్లు అర్జున్ ఈ మూవీపై స్పందించారు. చారిత్రాత్మక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగిన విషయమని బన్నీ పేర్కొన్నారు. రామ్ చరణ్ మగధీర సినిమా చూసినపుడు మెగాస్టార్ చిరంజీవిని అలాంటి సినిమాలో చూడాలని అనుకున్నానని, ఇప్పటికి ఆ కల నెరవేరినట్టు అల్లు అర్జున్ పేర్కొన్నాడు. రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించడం అభినందించదగిన విషయం అని, ఒక తండ్రికి కొడుకు ఇచ్చే గొప్ప బహుమతి ఇదే అని బన్నీ ఇంస్టాగ్రామ్ లో పేర్కొన్నారు. బ‌న్నీ కామెంట్ తో సైరాకు మ‌రింత ఊపు రానున్న‌ది.

Leave a comment