పూరికి రామ్ అదిరిపోయే గిఫ్ట్‌…!

వ‌రుస ప్లాఫ్‌ల‌తో కేరీర్ ముగించిన‌ట్లేనా అని దిగాలుగా ఉన్న స‌మ‌యంలో ఒక్క అవ‌కాశం అంటూ ఎదురు చూసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌కు హీరో రామ్ పోతినేని మ‌రిచిపోలేని అవ‌కాశం ఇచ్చి.. బ్లాక్ బ్ల‌స్ట‌ర్ విజ‌యం అందించాడు. ఇక వ‌రుస‌గా డిజాస్ట‌ర్ సినిమాల‌తో త‌న ప‌ని ఖ‌తం అని అనుకుంటున్న హీరో రామ్‌కు ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ఇస్మార్ట్ శంక‌ర్ రూపంలో మంచి సినిమాను అందించాడు.. ఇద్ద‌రికి ఒక‌రికి ఒక‌రు అనుకుని ముందుకు సాగారు.

అయితే ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ఇద్ద‌రి కేరీర్ లో వెలుగు నిండ‌టంతో ఇద్ద‌రు హ్యాపీగా ఉన్న ఈ త‌రుణంలో పుట్టిన రోజు జ‌రుపుకున్నాడు ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌. అయితే ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాలో వ‌చ్చిన లాభాల‌తో ఓకారు కొని ఎంజాయ్ చేస్తుండ‌టమే కాకుండా, చేసిన అప్ప‌లు తీర్చి ఎంచ‌క్కా కొత్త సినిమాలు చేస్తు ముందుకు సాగుతున్నాడు. అయితే వ‌చ్చిన లాభాల్లోంచి ఓ స‌మాజ సేవ‌గా ప‌నిలేకుండా ఖాళీగా ఉంటున్న ద‌ర్శ‌కులు, టెక్నిషియ‌న్ల‌కు కొంద‌రికి ఆర్థిక సాయం చేసి ఆదుకున్నాడు పూరీ.

అయితే ఇప్పుడు ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ పుట్టిన రోజు ఈనెల 28న ఓ ప్ర‌త్యేక గిప్ట్ ఇచ్చి పూరీని ఆశ్చ‌ర్య ప‌రిచాడ‌ట‌. అదేంటో తెలుసా.. గోల్డెన్ ఫాంటమ్ వైర్ లెస్ స్పీకర్. దీని ఖరీదు అక్షరాలా నాలుగువేల డాలర్లు. ఇందులో ఇస్మార్ట్ శంకర్ పాటలు పెట్టుకొని పూరి ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఛార్మి తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది. సో రామ్ పోతినేని పూరీకి గిప్ట్ ఇచ్చి త‌న భ‌క్తిని చాటుకున్నాడు..

Leave a comment