జోరుమీదున్న బాల‌య్య‌…ఆ హిట్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ !

బాల‌య్య ఉర‌ఫ్ నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు జోరుమీదున్న‌ట్లున్నాడు.. గ‌త కొంత‌కాలంగా రాజ‌కీయాలో బిజిగా ఉన్న బాల‌య్య ఎన్నిక‌ల‌కు ముందు తండ్రి నంద‌మూరి తార‌క రామారావు బ‌యోపిక్ గా రెండు సినిమాల్లో న‌టించాడు. ఈ రెండు సినిమాలు భారీ న‌ష్టాల‌ను చ‌విచూడ‌టంతో ఇక బాల‌య్య ప‌ని అయిపోయింద‌నుకున్నారంత‌.. అయితే ఎన్నిక‌లు అయిపోవ‌డం, తమ పార్టీ ఓట‌మి చెంద‌డం, అధికారం దూరం కావ‌డంతో బాల‌య్య‌కు స‌మ‌యం దొరికింది.

ఇక రాజ‌కీయాల్లో ఎమ్మెల్యేగా ఎంపికైనా చేసేది పెద్ద‌గా ఏమీ లేక‌పోవ‌డంతో ఇక సినిమాల‌పై దృష్టి సారించాడు బాల‌య్య‌. అయితే లేటు వ‌య‌స్సులో ఘాటు ప్రేమ అన్న‌ట్లుగా వ‌య‌స్సు మీద ప‌డుతున్నా కుర్ర‌కారులాగా ఛ‌లాకీగా ఉండి త‌న న‌ట‌న‌తో అంద‌రిని మెప్పించే ప‌నిలో ప‌డ్డాడు. అయితే ఇప్ప‌టికే 105వ చిత్రంగా కె.ఎస్‌. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో అంతా మోడ్ర‌న్‌గా క‌నిపిస్తున్న బాల‌య్య‌.. త‌న త‌దుప‌రి వ‌రుస‌గా సినిమాల‌కు ఆఫ‌ర్లు వ‌చ్చిప‌డ్డాయి..

ఇప్ప‌టికే బాల‌య్య ర‌వికుమార్‌తో సినిమా అయిపోగానే త‌దుప‌రి చిత్రంగా బోయ‌పాటితో సినిమా ఉంటుంద‌ట‌. ఇక త‌దుప‌రి చిత్రం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఈ రెండు సినిమాలు ఇంకా ప‌ట్టాలే ఎక్క‌లేదు.. కానీ త‌న 108వ చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడ‌ట‌. గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలకు దర్శకత్వం వహించిన క్రిష్ బాలయ్య 108 వ సినిమా చేయబోతున్నారని సోషల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతుంది. సో బాల‌య్య వ‌రుస సినిమాలు ఒప్పుకుంటూ కుర్ర‌హీరోల‌కు పోటీగా నిలుస్తున్నాడు.. బాల‌య్య మ‌జాకా..

Leave a comment