‘ గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ ‘ 10 డేస్ క‌లెక్ష‌న్లు.. ఆల్ సేఫ్‌

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ – హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన గద్దలకొండ గణేష్ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాడు. కోలీవుడ్‌లో హిట్ అయిన జిగ‌ర్తండాకు రీమేక్‌గా వ‌చ్చిన ఈ సినిమాను హ‌రీష్ శంక‌ర్ తెలుగు నేటివిటికి అనుకూలంగా బాగా మార్పులు, చేర్పులు చేశాడు.

గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ ఎక్కువుగా బి,సి సెంటర్స్ లో ప్రేక్షకులను ఎక్కువుగా ఆకట్టుకుంటుంది. ఏపీ, తెలంగాణ‌లో 10 రోజుల‌కు దాదాపుగా రు.21 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఈ సినిమా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వ‌చ్చేసింది. ఇక మ‌రో రోజులో సైరా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ సైరాను త‌ట్టుకుని ఇంకెత వ‌ర‌కు ముందుకు వెళుతుందో ? చూడాలి.

‘ గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ ‘ 10 డేస్ ఏరియా వైజ్‌ కలక్షన్ల షేర్ వివరాలు (రూ.కోట్ల‌లో) :

నైజాం – 7.78 కోట్లు

సీడెడ్ – 3.53 కోట్లు

వైజాగ్ – 2.51 కోట్లు

కృష్ణ – 1.40 కోట్లు

గుంటూరు – 1.72 కోట్లు

నెల్లూరు – 0.86 కోట్లు

ఈస్ట్ – 1.63 కోట్లు

వెస్ట్ – 1.41 కోట్లు
———————————————————-
ఏపి & తెలంగాణ 10 రోజుల షేర్ : 20.84 కోట్లు
———————————————————–

Leave a comment