సైరాకే స‌వాల్‌…చిరుపై కుర్ర హీరో పోటీ…

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా సైరా నరసింహారెడ్డి అంటే భయం లేదా.. లేక ఆ సినిమా అనుకున్న ప్రకారం రిలీజ్ కాదన్న ధీమానో కాని ఓ కుర్ర హీరో సైరాకు పోటీగా స‌వాల్ విసురుతున్నాడు. ద‌స‌రా బ‌రిలో ఓ మీడియం రేంజ్ సినిమా రెడీ అయ్యింది. సైరాను ముందుగా అనుకున్న దాని ప్ర‌కారం అక్టోబ‌ర్ 2న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న సైరా ద‌స‌రాకు ఆల్ ఇండియా లెవ‌ల్లో సోలోగా రావాల‌ని అనుకున్నా ఈ సినిమాకు ఇప్ప‌టికే హిందీ సినిమా ‘వార్’ నుంచి ముప్పు పొంచి ఉంది.

ఉత్తరాదిన ఆ సినిమా పోటీని తట్టుకోవడం కష్టమే. తెలుగులో దీనికి పోటీగా మరో సినిమా రాదనే అంతా అనుకున్నారు. కానీ గోపీచంద్ సినిమా చాణక్యతో పాటు ఓంకార్ హార్రర్ కామెడీ మూవీ రాజు గారి గది-3 ద‌స‌రా బ‌రిలో ఖ‌ర్చీఫ్ వేస్తున్నాయి. మ‌రోవైపు వెంకీ – చైతుల వెంకీ మామ ఉండ‌నే ఉంది. అయినా చాణ‌క్య‌, రాజు గారి గ‌ది -3 లైన్లో ఉండ‌డం అంటే వీటికి అంత ధీమా ఏంటో ఆశ్చర్యం కలిగిస్తోంది.

వ‌రుస ప్లాపుల‌తో ఉన్న గోపీచంద్ చాణ‌క్య సినిమా మ‌నోడి కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింది. ఈ సినిమా రూ 30-35 కోట్ల‌తో తెర‌కెక్కుతోంది. వరుస ఫ్లాపులతో గోపీ మార్కెట్ బాగా దెబ్బ తినేసి ఉంది. ఇలాంటి సమయంలో సోలో రిలీజ్ చాలా అవసరం. ఏకంగా మెగాస్టార్ ప్రెస్టేజ్ మూవీతో పోటీ ప‌డుతున్నాడంటే సినిమా మేక‌ర్స్‌కు అంత ధీమా ఏంటో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు.

తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోపీ.. స్పై క్యారెక్టర్ చేస్తున్నాడు. అనిల్ సుంక‌ర ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ప్లాప్ అయితే గోపీ కెరీర్ డేంజ‌ర్‌లో ప‌డిన‌ట్టే..

Leave a comment