టాలీవుడ్‌లో ద‌స‌రా, దీపావ‌ళి వార్ ఫిక్స్‌

సినిమా క్యాలెండ‌ర్‌లో ప్ర‌తి యేడాది సంక్రాంతి, వేస‌వి త‌ర్వాత అత్యంత ప్రాధాన్యం ఉన్న సీజ‌న్ ద‌స‌రా. ఇది హిందువుల‌కు పెద్ద పండ‌గ. అంతే కాకుండా ద‌స‌రాకు ఏకంగా 10 రోజుల పాటు సెల‌వులు ఉంటాయి. దీంతో ఎక్కువ మంది ఈ సీజ‌న్ల‌లో సినిమాలు చూసేందుకు ఆస‌క్తితో ఉంటారు. అందుకే సినిమా నిర్మాత‌లు కూడా అదే సీజ‌న్‌ను టార్గెట్గా చేసుకుని త‌మ సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. ఇక ఈ ద‌స‌రా, దీపావ‌ళికి టాలీవుడ్ క్రేజీ సినిమాలు లైన్లో ఉన్నాయి.

ఈ దసరా పండుగకు చిరంజీవి, వెంకటేష్ చిత్రాలు రిలీజ్ అయ్యే అవ‌కాశాలున్నాయి. మహేష్ సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయి. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది. ఇక యంగ్ హీరోలు నాని గ్యాంగ్‌లీడ‌ర్‌, వ‌రుణ్ వాల్మీకి సినిమాలు ఈ నెల 13, 20న రిలీజ్ అవుతున్నాయి.

అల్లరి నరేష్ బంగారు బుల్లోడు దీపావళి కానుకగా విడుదల కానుంది. దీనితో టాలీవుడ్ లోని బడా హీరోలతో పాటు, యంగ్ హీరోలు కూడా దసరాకు చిత్రాలు విడుదల చేసే అవకాశం లేదు. ఓవ‌రాల్‌గా ద‌స‌రా బ‌రిలో సీనియ‌ర్ హీరోలు అయిన చిరు సైరా, వెంకీ – చైతుల వెంకీ మామ మాత్ర‌మే రేసులో ఉన్నాయి. ఇక రాజుగారి గది3 తో పాటు, చిన్న సినిమాలు కూడా రేసులో ఉన్నాయి. మ‌రి ఈ సినిమాల్లో ఏవి హిట్‌… ఫ‌ట్ అవుతాయో ? చూడాలి.

Leave a comment